ఒంగోలు అర్బన్: ఒంగోలు, చీమకుర్తి ప్రాంతాలలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ఒంగోలు, చీమకుర్తి పరిసర ప్రాంతాలలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా ప్రజలందరికీ సరఫరా అయ్యే విధంగా చూస్తామని ఎస్పీ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే పెట్రోల్ బంకుల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.