డోన్: బేతంచర్ల లో పెంపుడు కుక్కలకు టీకాలు
Dhone, Nandyal | Jul 6, 2026 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బేతంచెర్ల ప్రభుత్వ పశువైద్యశాలలో 64 కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు వెటర్నరీ ఏడి రామ సుబ్బారెడ్డి తెలిపారు. వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు రేబిస్ వ్యాధి నివారణకు పెంపుడు కుక్కలకు ప్రతి ఏడాది తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు. కార్య క్రమంలో పశువైద్యులు అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.