గుంతకల్లు: పట్టణానికి చెందిన క్రాంతికుమార్ అనే యువకుడు భారత మహిళల ప్రపంచ కప్ జట్టుకు ఫిట్ నెస్ కోచ్ గా ప్రతిభ
భారత దేశ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో గుంతకల్లు పట్టణానికి చెందిన క్రాంతికుమార్ అనే యువకుడు ముఖ్య భూమిక పోషించాడు. భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికమార్ ఘనత సాధించాడు. పట్టణానికి చెందిన క్రాంతి కుమార్ స్నేహితులు, బంధువులు మంగళవారం వివరాలు తెలిపారు. క్రాంతి కుమార్ పట్టుదలతో కోర్సులు చదివాడు. అప్పటి నుంచి దేశ జట్లకు సేవలు అందించాలనే లక్ష్యంగా అడుగులు వేశాడు. తొలుత జిల్లా, రాష్ట్ర జట్లకు ఫిట్ నెస్ కోచ్ గా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళ క్రికెట్ జట్టు ఫిట్నెస్ కోచ్ తో పాటుగా ఫిజియోథెరపిస్ట్ గా సేవలు అందించాడు.