ఆళ్లగడ్డ: ఆర్ కృష్ణాపురం గ్రామంలో రోకలిబండతో మోది హత్య చేసిన నిందితుల అరెస్టు, ఏ ఎస్ పి మంద జావలి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మంద జావలి మంగళవారం తెలిపారు, ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుర్రం దేవ భక్తుడు అనే వ్యక్తిపై ఆస్తి తగాదాలతో అదే గ్రామానికి చెందిన గుర్రం విజయ రాజు, సుధారాణిలు రోకలిబండతో హత్య చేయడం జరిగిందన్నారు, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామన్నారు, ఈ కార్యక్రమంలో సిఐఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు