త్వరలో నిర్వహించనున్న సాధారణ ఎన్నికల్లో తపాలా బ్యాలెట్ దుర్వినియోగం కాకుండా చూడాలి..జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా#@
అమలాపురం మార్చి 4: భారత ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా ఆచరిస్తూఎన్నికల సిబ్బందికి ఇచ్చే తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎన్నిక ల సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో తపాలా బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. తపాలా బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు. ఫారం-13ఏ: ఓటరు ధ్రువీకరణ పత్రం పూర్తిగా వివరాలతో నింపి సంతకం చేసి గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ చేయించి డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు