జహీరాబాద్: కొత్తూరు డి వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆటో దగ్ధం
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూరు డి వద్ద 65 నెంబర్ జాతీయ రహదారిపై ఆటో దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిఎన్జి ఆటో కొత్తూరు డి వద్ద నిలిపి ఉంచగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కోహిర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.