పలమనేరు: పెద్దపంజాణి: రాయలపేట గ్రామానికి చెందిన చంద్రబాబుపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసు శాఖ.
పెద్దపంజాణి: మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబుపై జిల్లా పోలీసు అధికారులు పిడి యాక్టు నమోదు చేశారు. నిందితుడు పలమనేరు, పెద్ద పంజాణి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు బెట్టింగ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతనివల్ల తిరుపతి, బెంగుళూరు, పుంగనూరు, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాల్లో పలువురు యువత బెట్టింగులు కట్టి లక్షల్లో మోసపోయి పలువురు ఆత్మహత్య సైతం చేసుకున్నారని తెలిపారు.