నంద్యాల అర్బన్: గిద్దలూరు లో సీఎం పర్యటన వేల నంద్యాల గిద్దలూరు రహదారిపై ఆంక్షలు
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
సీఎం చంద్రబాబు గిద్దలూరు మండలం కృష్ణం శెట్టిపల్లె పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మహానందిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే వాహనాలకు ముందస్తు అనుమతి ఉంటే తప్ప ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ ఆంక్షలు విధించినట్లు SI రామ్మోహన్ రెడ్డి తెలిపారు. బోయలకుంట్ల మెట్ట-ఆంజనేయపురం వద్ద పోలీసులు భారీగేట్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేస్తున్నారు.