బనగానపల్లె: ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆందోళన.
బనగానపల్లె: ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు గృహాలకు స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా కార్య దర్శి శివయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సోమవారం బనగానపల్లెలోని సచివాలయాల్లో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, కులాయప్ప, శివ, నాగన్న, గఫార్, మహిళలు పాల్గొన్నారు.