పుంగనూరు: తనపై వ్యక్తిగతంగా కక్షకట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఉప కమిషనర్ ఏకాంబరం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ గతంలో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న చెంగప్ప అనే వ్యక్తిపై ఆరోపణలు రావడంతో అతనిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. కోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలో చంగప్ప బావ ఆదినారాయణ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తనపై ఆరోపణ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.