విశాఖపట్నం: విశాఖ : నమో నారసింహ : ఈ నెల 23 నుంచి సింహాచలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. త్రినాధరావు సోమవారం తెలిపారు.ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా, భక్తకోటి ఇలవేల్పుగా పూజలందుకునే సింహాచల క్షేత్రం భారతదేశంలోని అతి ప్రాచీనమైన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.