దర్శి: బొద్దికూరపాడులో కందుల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తాళ్లూరు ఏవో ప్రసాదరావు
Darsi, Prakasam | May 14, 2025 బొద్దికూరపాడులో కందుల కొనుగోలు కేంద్రం నడుస్తోందని తాళ్లూరుమండల ఏవో ప్రసాదరావు తెలిపారు. నాగంబొట్లపాలెం సొసైటీ పరిధిలో నడుస్తున్న ఈ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఇప్పటివరకు 85 మంది రైతుల నుంచి 75.15 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేశామన్నారు. కంది సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.