డోన్ మండలం జగదుర్తి సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర మంగళవారం తెలిపారు. వెల్దుర్తి 33కేవి ఫీడర్ లైన్ షిఫ్ట్ పనుల కారణంగా సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు కరెంట్ ఉండదన్నారు. అలాగే రైతులకు త్రీఫేస్ కరెంటు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7గంటల వరకు ఇస్తామన్నారు. వినియోగదారులు అంతరానికి సహకరించాలని DEE కోరారు.