పుంగనూరు: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
సిఐ. సుబ్బారాయుడు,
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ముడియప్ప సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు కోసం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు .ర్యాలీలో పాల్గొన్న సిఐ. సుబ్బారాయుడు ,శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే పరిసరాల పరిశుభ్రత. ప్లాస్టిక్ వాడకం పై కలిగే సమస్యల మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.