ఘన్పూర్: తాడిపర్తి గ్రామంలోని చెరువులో చేపలు మృతి, ఆందోళనలో మత్స్యకారులు
గోపాల్ పేట మండలంలోని తాడిపర్తి గ్రామంలో ఉన్న చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లగా అక్కడ చేపలు మృతి చెందడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ముందే ఎండాకాలం కావడంతో వరి సాగుకు, ఇతర అవసరాలకు నీటిని ఉపయోగించడంతో నీటి ప్రవాహం తగ్గింది. సుమారు 5వేలకు పైగా చేపలు చనిపోయి ఒడ్డుకు చేరాయి. చేపల మృతికి గల కారణాలు తెలపాలని గ్రామస్తులు మత్స్యశాఖ అధికారులను కోరుతున్నారు.