ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48 శాతం పోలింగ్ నమోదు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా సా.6 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రహమత్నగర్లోని పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులను పోలింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. భారీ భద్రతల నడుమ ఈ తరలింపు చేపట్టారు. కాగా, ఈనెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి.