బేతంచెర్ల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రదాడి మృతులకు కొవ్వొత్తులతో నివాళి
Dhone, Nandyal | Apr 28, 2025 బేతంచర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిలో మృతులకు స్థానిక షాలేము చర్చిలో సోమవారం నివాళులర్పించారు. భారతీయులపై మత వివక్షతతో దాడి చేయడం ఉగ్రవాదుల హేయమైన చర్య అని మండల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసన్న, సెక్రెటరీ ప్రసాద్ అన్నారు. ఉగ్రవాదుల దాడిని భారతీయులందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.