ఒంగోలు అర్బన్: ఒంగోలు మునిసిపాలిటీ 150 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 29, 2026
ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు అయినందున మే ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఐదు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటిలో ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు ఒంగోలు నగరాన్ని సుందరంగా ఉంచటంలో వారు కూడా బాధ్యతగా ఉండేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు. కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమును కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలోని సమస్యలను పరిష్కరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ వ