నారాయణపేట మండల పరిధిలోని జాజాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా బుధవారం సుమారు 9 గంటల సమయంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26 వ తేదీన మన దేశంలో సంవిధాన్ దివాస్ అని కూడా పిలవబడే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటున్నట్లు తెలిపారు. 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపారు.