కరీంనగర్: గత ప్రభుత్వంలో ట్రైబల్ కమిషన్ వేయకపోవడం వల్ల ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఉమ్మడి జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ ఆదివాసి శిక్షణ శిబిరాన్ని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ నాడు ఈ దేశంలో ఆదివాసీలకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా ఉంది ఇందిరా గాంధీ మాత్రమే అని అన్నారు. ఈ శాఖ మంత్రిగా మీరు ఏ సూచనలు చేసినా మీరు చెప్పిన అభిప్రాయాలను తీసుకొని, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ట్రైబల్ కమిషన్ కు కమిటీ వేయలేదని, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.