అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు రంపచోడవరం సిఐ సన్యాసినాయుడు తెలిపారు. పెద గెద్దాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందని, బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతుండగా పశువులు అడ్డు రావడంతో, వాటిని ఢీకొట్టి పడిపోయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.