ఒంగోలు అర్బన్: రైతు భూమిని భగవంతుడిగా నమ్ముతాడు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం తోడైంది: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 29, 2026
పంటను పండించే రైతు భూమిని భగవంతుడిగా నమ్ముతాడని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సోమవారం మర్రిపూడి మండలం లో జరిగిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు సాంప్రదాయ దుస్తులలో సందడి చేశారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదని ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని కలెక్టర్ అన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీస్ ఉందని అధికారులు ఉన్నారని ముందే వర్షాలు వస్తున్న సమాచారం కూడా ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.