ఒంగోలు అర్బన్: పోలియో రహిత సమాజమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 28, 2026
తేది:28.06.2026, ఒంగోలు: రాష్ట్రంలో పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు బాలాలత గార్లతో కలిసి చిన్నారులకు జనార్దన్ గారు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ, పోలియో నిర్మూలన బాధ్యత అందరిదీ అని అన్నారు. అయిదేళ్లలోపు తమ బిడ్డలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు.