నల్లబ్యాడ్జీలతో నరసరావుపేట విద్యుత్ ఉద్యోగుల నిరసన
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు నరసరావుపేట కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం 5గంటలకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించిన విద్యుత్ శాఖ జేసీఏ నాయకుడు బంగారయ్య, విద్యుత్ రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్య లను పరిష్కరించాలని కోరారు. దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.