పెద చెర్లోపల్లి టిడిపి కార్యాలయంలో బుధవారం మండల టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కనిగిరి నియోజకవర్గం టిడిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ గయాజ్ భాష హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన పెదచెర్లోపల్లి మండలంలో పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే మండలంలో MSME పార్కుల స్థాపన, రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు.