అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఈ నెల 13న జరిగిన మహిళ శాంతి దారుణ హత్య కేసులో ముగ్గురి పై కేసు నమోదు చేశామని మండలంలోని గుండ్లపల్లి క్రాసింగ్ ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఉరవకొండ రూరల్ సీఐ మహానంది, బెళుగుప్ప ట్రైనీ ఎస్ఐ మహేష్ తో కలసి సోమవారం రాత్రి 7 గంటలకు విలేకరుల సమావేశంలో సీఐ పేర్కొన్నారు. మహిళ హత్య కేసులో భర్త ఆంజనేయులు ఇదివరకే లొంగిపోగా, ప్రస్తుతం A2 ముద్దాయిగా తిప్పేస్వామిని, A3 ముద్దాయిగా జయసింహ ను అరెస్టు చేశామన్నారు. ముద్దాయిలను కోర్టుకు హాజరు పరుస్తామని సిఐ పేర్కొన్నారు.