నందికోట్కూరు: జూపాడు బంగ్లా గురుకుల పాఠశాలలో ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన
మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు అన్నారు.నంద్యాల జిల్లా జుపాడుబంగ్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాదకద్ర వ్యాల దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు.ఎస్ఐ లు జాఫురుల్లా,భాష్యం శ్రీనివాసులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐ రామాంజనేయులు మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక. కానీ నేడు కొందరు యువకులు సరదాగా మొదలుపెట్టి మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడి తమ బంగారు భవిష్యత్తున