గుంటూరు: విద్యానగర్లో భారీ వర్షం కారణంగా పడిపోయిన చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నామని తెలిపిన నగర కమిషనర్ శ్రీనివాసులు
Guntur, Guntur | Sep 14, 2025 గుంటూరు విద్యానగర్ లోని ఐటీసీ హోటల్ నుండి బృందావన్ గార్డెన్స్ వెళ్లే రోడ్డు మార్గంలో భారీ వర్షం కారణంగా పడిపోయిన చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఒక ప్రకటన ద్వారా నగర కమిషనర్ మాట్లాడారు భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు మరియు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే గుంటూరు నగర పాలకు సంస్థ కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని కోరారు. నగరంలో భారీ వర్షం కారణంగా పలు వాహనాలు ధ్వంసం కాగా, పలు నివాసాలు వర్షపు నీటి ముంపుకు గురయ్యాయి. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు.