ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడలో టిడిపి వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ, వైసీపీ జడ్పిటిసి పుణ్య లక్ష్మీదేవికి గాయాలు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో శనివారం సాయంత్రం టిడిపి వైసిపి నేతలు ఘర్షణ పడ్డారు, ఉయ్యాలవాడ వైసిపి జడ్పిటిసి పుణ్య లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి, గ్రామంలోని బావి దగ్గర స్థలంలో రోడ్డు వేయడంతో లక్ష్మీదేవి వర్గం, టిడిపి నేతల వర్గాలు ఘర్షణ పడ్డాయి, ఈ ఘర్షణలో జడ్పిటిసి లక్ష్మీదేవి తలకు తీవ్ర గాయమైంది వెంటనే 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి, వైసిపి నాయకులు ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు.