ఒంగోలు అర్బన్: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు చేసిన నాగేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నాయకుడు వంశీ
Ongole Urban, Prakasam | May 20, 2026
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఒంగోలు జనసేన నాయకుడు నాగేంద్రం ఆరోపణలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఒంగోలు జనసేన నాయకుడు వంశీ నాగేంద్రం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న మాజీ మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని అన్నారు. మొన్నటి వరకు నాగేంద్రం నాకు దైవమని మాట్లాడి నేడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని కావాలనే ఎవరో వెనక ఉండి ఈ పని చేయిస్తున్నారని వంశి ఆరోపించారు.