ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టడంలో అసెంబ్లీ ఎన్నికల తరహా JMB చర్చి ఎన్నికలు, కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని జే.యం బి చర్చి కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఉత్కంఠగా ప్రారంభమైంది. కొంతకాలంగా చర్చి కార్యవర్గ విషయంలో చోటుచేసుకుంటున్న విభేదాలు, గొడవలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించారు. సబ్ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.