పుంగనూరు: కంగా నెల్లూరులో మగ వ్యక్తి అదృశ్యం.
కేసు నమోదు. సిఐ. సుబ్బారాయుడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కంగా నెల్లూరు. గ్రామంలో కాపురం ఉంటున్న లేట్ లక్ష్మన్న కుమారుడు పి చిన్నరెడ్డప్ప . 60 సంవత్సరాలు.ఉదయం ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్ద పశువులు మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో పుంగనూరు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి కనబడటం లేదని కూతురు శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసి తన తండ్రి అదృశ్యం వెనుక గంగులప్పా, చెన్నకేశవులు, జయశంకర్, పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ .సుబ్బారాయుడు తెలిపారు.