గుంతకల్లు: గుత్తిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా కలశ ప్రతిష్ట కార్యక్రమం
గుత్తిలోని మెయిన్ బజార్లో వెలిసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం కలశ ప్రతిష్ట, హోమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వాసవి మహిళా మండలి సభ్యుల పర్యవేక్షణలో కలశ ప్రతిష్ట, హోమాలు నిర్వహించారు. గురువారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.