సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. వివిధ బూత్ అధ్యక్షులు, మండల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.