ఒంగోలు అర్బన్: డీఎస్సీ పోస్టులను రూ.15 లక్షలకు అమ్ముకున్నారు: జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 12, 2026
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దరిశి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా 'డీఎస్సీలో పోస్టులను ఒక్కోటి రూ.15 లక్షలకు అమ్ముకున్నారన్నారు. జగన్ హయాంలో నివేశస్థలాలతో సహా కాలనీలు నిర్మించిస్తే, ఆరోజు స్థలం తక్కువ అని హేళన చేశారన్నారు.