జహీరాబాద్: బూచి నెల్లి సమీపంలో భారీ వర్షంతో పొంగిపొర్లిన వాగు, నిలిచిన రాకపోకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి వెళ్లే దారిలో భారీ వర్షంతో వాగు పొంగిపొర్లుతుంది. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో సోమవారం సాయంత్రం బూచి నల్లి సమీపంలో రహదారిపై గల కల్వర్టు పై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు భారీగా ప్రవహిస్తున్న దృశ ప్రజలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచిస్తున్నారు.