తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రిలో ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పట్టణంలోని పెద్ద బజార్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గుగారా(41) నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఉరివేసుకొని తనువు చాలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.r