ఇల్లందకుంట: మండల కేంద్రంలో నిరుపేద కొమురక్క ఇంటిని పరిశీలించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి MLA కౌశిక్ రెడ్డి డిమాండ్
ఇల్లందకుంట: మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబమైన కొమురక్క ఇంటిని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురక్క ఇంటిని చూసి చలించిపోయానని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలు ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం మానేసి ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా ఇల్లు కట్టిస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.