డోన్: బేతంచర్ల లో మే డే కోసం ముస్తాబవుతున్న కార్మిక కార్యాలయాలు
Dhone, Nandyal | Apr 30, 2026 నంద్యాల జిల్లా బేతంచర్లలోని సీఐటీయూ కార్యాలయాన్ని కార్మికులు ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం జరిగే మేడే కార్యక్రమాల కోసం వీధి అంతా రంగురంగు కాగితాలతో అలంకరిస్తున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న రోజును మేడే ఒకటిగా జరుపుకుంటామని, శుక్రవారం జరిగే మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎల్లయ్య గురువారం పిలుపునిచ్చారు.