డోన్: డోన్ లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
Dhone, Nandyal | May 17, 2026 నంద్యాల జిల్లా డోన్లో కర్నూల్ రైల్వే గేట్ల సమీపంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చెట్టు చిన్న కొమ్మకు తాడు కట్టి మృతదేహం వేలాడుతున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడు దొరపల్లె గ్రామానికి చెందిన జంగాల శ్రీరాములుగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.