సదాశివనగర్: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు, 108 లో ఆస్పత్రికి తరలింపు
సదాశివనగర్ మండలంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 44వ జాతీయ రహదారి పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుండి సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నారు. వజ్జేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది అని స్థానికులు తెలిపారు.