నంద్యాల అర్బన్: నంద్యాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: మున్సిపల్ కమిషనర్ శేషన్న
Nandyal Urban, Nandyal | May 8, 2026
నంద్యాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని పురపాలక కమిషనర్ బండి శేషన్న వ్యాపారులను హెచ్చరించారు. పట్టణంలోని బైర్మల్ స్ట్రీట్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పలు దుకాణాలను స్వయంగా తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను, గ్లాసులను స్వాధీనం చేసుకొన్నారు. ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.