అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని ఎల్లనూరు మండలం బుగ్గపురం గ్రామానికి చెందిన సత్యమయ్య అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యంత విభాగంలో చికిత్స పొందుతున్న మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వారి కుటుంబ సభ్యులు అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.