నంద్యాల అర్బన్: ఇళ్ల పట్టాల సమస్యలపై మంత్రి ఫరుక్ కు వినతి పత్రం అందించిన అబాండం తండా నివాసితులు
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
నంద్యాలలోని అబాండం తండా నివాసితులు ఇళ్ల పట్టాల సమస్యపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు మంత్రి ఎన్ఎండీ ఫారుక్ను కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఇళ్ల పట్టాల వ్యవహారాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి, నిబంధనల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు