అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం.కురబలకోట మండలంలో మదనపల్లె డిఎస్పి మహేంద్ర ఆదేశాల మేరకు. ఎస్సై దిలీప్ కుమార్ సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. మైనర్లు నడుపుతున్న 25 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ముదివేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. మైనర్లు వాహనాలు నడిపినందుకు అపరాధ రుసుం విధించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.