వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్న బీజేపీ నేతలు కారణం ఇదే
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి సన్నిధిలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూజలు చేసినట్లు బిజెపి సీనియర్ నేత ప్రతాప రామకృష్ణ అన్నారు.ప్రధాని మోదీ భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని,ప్రధాని మోదీ ఆయుర్ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.రాజన్న గుడి పరిసర ప్రాంతాలోని భక్తులకు స్థానికులకు స్వీట్స్ పంపిణీ చేశారు.