పాలకొల్లు: స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లులో ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ఆడపిల్లలకు 14 అంశాలలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళ ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఆరోగ్యం ఉండగలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.