మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాలకు అలవాటు పడి విద్యుత్ తీగలను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుల నుంచి మారుతి స్విఫ్ట్ కారు, బజాజ్ పల్సర్ బైక్, రూ.4 లక్షల విలువైన 81 విద్యుత్ వైర్ల బేండళ్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ వాసి దిలీప్ కుమార్, హఫీజ్‌పేట వాసి నిశాల్ కరల్కర్ను అరెస్ట్ చేశామన్నారు.