వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు అన్నారు. షాద్‌నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా. విష్ణువర్ధన్ రెడ్డికి ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. వైద్య విధాన పరిషత్‌ను రద్దుచేసి, ట్రెజరీ శాలరీస్ పరిధిలోనికి తీసుకురావాలని కోరారు