వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రిలో ఓ శిశువు మరణించిన విషయం తెలిసిందే. నల్గొండ(మం) చిన్నసూరారానికి చెందిన షేక్ షామిన(24) DEC 3న డెలివరీకి అడ్మిట్ అయింది. 5న బాబు పుట్టాడని డాక్టర్లు చెప్పారు. అయితే కొద్ది సేపటికే బాబు చనిపోయాడని సిబ్బంది చెప్పారు. డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్షంతోనే బాబు చనిపోయాడని బందువులు ఆరోపించారు. తండ్రి హైమత్ హాలీ ఫిర్యాదుతో కేసు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.